అంబర్ పేటలో 370 కిలోల గంజాయి పట్టివేత

అంబర్ పేటలో 370 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. నగర శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ వద్ద ఎస్ఓటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఓఆర్ఆర్ వద్ద ఓ కంటెయినర్ ను తనిఖీ చేయగా అందులో పెద్దమొత్తంలో గంజాయిని గుర్తించారు. మొత్తం 370 కిలోల మత్తుమందును పోలీసులు సీజ్ చేశారు.

ఈ గంజాయిని ఏపీలోని తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.