ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ 

ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు ఊరట లభించింది. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన ఆయనకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ చిత్తూరు పట్టణ నాలుగో మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చిన మెజిస్ట్రేట్ పోలీసుల రిమాండ్ కు నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నిన్న మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ అనంతరం మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 2014 లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రూ. లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్స్ లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ కేపీహెచ్ బీలోని తన నివాసంలో మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఆయనను ఏపీలోని చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27న తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ లో సర్క్యులేట్ అయినట్లు చిత్తూరు వన్ టౌన్ ఠాణాలో నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు.