నేటి నుంచి యువగళం పాదయాత్ర మళ్ళీ ప్రారంభం
వరంగల్ టైమ్స్,అమరావతి : సోమవారం నుంచి టీడీపీ యువనేత నారా లోకేష్ మరో దఫా యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు,ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ జనగళమే యువగళంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాద యాత్ర 79 రోజుల సుదీర్ఘ విరామానంతరం మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అరా చకపాలన, అవినీతి బాగోతాన్ని ఎండగడుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనా యించి జైలుకు పంపడంతో అనివార్య పరిస్థితుల్లో సెప్టెంబర్ 9వ తేదీన కోన సీమలోని రాజోలు నియో జకవర్గం పొదలాడ వద్ద యువనేత లోకేశ్ పాద యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
తర్వాత దేశరాజధాని డిల్లీలో జగన్మోహన్ రెడ్డి అరాచకపర్వంపై న్యాయపోరాటం చేస్తూనే యువనేత లోకేష్ జాతీయస్థాయి నేతల మద్దతు కూడగడుతూ జాతీయ మీడియాలో తమ గళాన్ని బలంగా విన్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న తీరును ఆమె దృష్టికి తెచ్చారు. అధినేతను అక్రమంగా నిర్బంధించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకున్న జగన్ అండ్ కో కుట్రలను పటాపంచలుచేస్తూ న్యాయ దేవత ఆశీస్సులతో చంద్రన్న త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారు.తాజా పరిణామాలను పార్టీ పెద్దలతో చర్చించిన యువనేత లోకేష్, అన్ని అడ్డంకులను అధిగమించి సోమవారం నుంచి గతంలో పాదయాత్ర నిలుపుదల చేసిన రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి యువగళాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు.