ఇక నుంచి ఎన్నికల విధులకు వారు దూరం !
వరంగల్ టైమ్స్, న్యూ ఢిల్లీ : ఇక నుంచి ఎన్నికల విధులకు వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లకు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు, విధులకు వార్డు వాలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వార్డు వాలంటీర్లపై ఏమైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.