సిగ్గు సిగ్గు.. విద్యార్థితో ఉడాయించిన టీచరమ్మ

సిగ్గు సిగ్గు.. విద్యార్థితో ఉడాయించిన టీచరమ్మ

సిగ్గు సిగ్గు.. విద్యార్థితో ఉడాయించిన టీచరమ్మవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం నేర్పాల్సిన టీచరమ్మ దారి తప్పింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరమ్మ కాస్త ప్రేమ పాఠాలు చెప్పిందో ఏమో తెలియదు కానీ, తాను చదువు చెబుతున్న స్కూల్ విద్యార్థిపైనే మనసుపడింది. ఇంకేముంది ఆ అబ్బాయిని తీసుకుని పారిపోయింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ లోని చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. చందానగర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో స్థానికంగా ఉండే ఓ అబ్బాయి (15) టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. గచ్చిబౌలికి చెందిన ఓ యువతి ( 27) అదే స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది.

కాగా ఈ టీచరమ్మ తాను చదువుచెప్పే ఆ అబ్బాయిని తీసుకుని 10 రోజుల క్రితం ఎటో వెళ్లిపోయింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఫిబ్రవరి 16న చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీచరమ్మ తల్లిదండ్రులు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. టీచరమ్మ జాడ కనిపెట్టి, విద్యార్థితో సహా వారిద్దరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎవరి ఇంటికి వారిని తిరిగి పంపించారు.