ఎదురుకాల్పుల్లో మావో మృతి, జవాన్ కు గాయాలు

ఎదురుకాల్పుల్లో మావో మృతి, జవాన్ కు గాయాలు

వరంగల్ టైమ్స్, బీజాపూర్ జిల్లా : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కైకా, మౌస్లా మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సెండ్రా ఎల్.ఓ.ఎస్ డిప్యూటీ కమాండర్ రితేష్ పూనమ్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఆయుధం, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై రూ.3 లక్షల రివార్డు ఉన్నట్లు, ఘటనలో ఒక జవాన్‌కు గాయాలైనట్టు బీజాపూర్ ఎస్పీ కమలేషన్ కశ్యప్ ధృవీకరించారు.