ఆటో ట్రాలీ, లారీ ఢీ ఇద్దరు దుర్మరణం
వరంగల్ టైమ్స్, అమరావతి : గుంటూరు జిల్లా నకరికల్లు మండలం దేచవరం మిద్ద సమీపంలో నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న మొగిలి వెంకటేశ్వర్లు, రాగిడి ఆదినారాయణ మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.