ప్రముఖ న్యాయవాదిపై దుండగుల దాడి
వరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా : పొన్నూరు బార్ అసోసియేషన్ న్యాయవాది షేక్ కరీముల్లా ఇంటిపై గత రాత్రి దుండగులు దాడి చేసి హత్యాయత్నం చేసిన ఘటనను పొన్నూరు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా పొన్నూరు న్యాయవాదులు ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఇలా ఉండగా పార్టీలకతీతంగా పట్టణ ప్రముఖులు సానుభూతిని తెలియజేస్తున్నారు.