పెద్దపులి పిల్లలను కాపాడిన గ్రామస్థులు
వరంగల్ టైమ్స్, నంద్యాల జిల్లా : ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గ్రామస్థులు గుర్తించారు. అయితే గ్రామంలోకి వచ్చిన పెద్ద పులి పిల్లలపై కుక్కలు దాడి చేస్తాయని గుర్తించిన స్థానికులు ఏ మాత్రం భయపడకుండా పెద్దపులి పిల్లలను ఓ గదిలో భద్రపరిచారు. అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు నాలుగు పెద్దపులి పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పెద్దపులి పిల్లలను తమకు అప్పగించిన గ్రామస్థులను అటవీశాఖాధికారులు అభినందించారు.