ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నం

వరంగల్ రూరల్ జిల్లా :  పదహరేండ్లకే పెళ్లి… రెండు పదుల వయసు వచ్చే సరికే కట్టుకున్న మొగుణ్ణి దూరం చేశాడా దేవుడు. ట్రాక్టర్ తిరగబడంతో మృత్యువాత పడ్డాడు. అయినా ధైర్యంతో తన ఇద్దరు పిల్లల్ని కూలి నాలి చేసుకుంటూ సాకుతూ వస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ నిరుపేద కుటుంబానికి మరో రూపంలో మృత్యువు పొంచి ఉంది. క్యాన్సర్ ఆమెను కబలిస్తోంది.తన ఇద్దరు పిల్లల కోసం ఆ తల్లి చేయని ప్రయత్నం లేదు. ఆస్పత్రుల చుట్టూ తిరుగు తూనే ఉంది. అటు చూస్తే చిన్న పిల్లలు.. వారి ఆలనా పాలనకే ఒక పూట ఉంటే ఇంకో పూట లేని స్థితి. వైద్యం చేస్తే తప్ప బతకని పరిస్థితి ఆమెది. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…వరంగల్ రూరల్ జిల్లా మం, దుగ్గొండి, తిమ్మంపేట ఎస్సీ కాలనీకి చెందిన మనుబోతుల. సుమన్ కి ఏడేండ్ల కిందట పెళ్లయింది. అతని భార్య సుజాత. అతనికి ఇద్దరు చిన్న పిల్లలు. 2017లో ట్రాక్టర్ తిరగబడి ప్రమాదవశాత్తు సుమన్ మరణించాడు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్ధికంగా చితికిపోయింది.ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నంకూలీ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సుజాత మెడపై అంతుచిక్కని గడ్డ ఒకటి తయారయ్యింది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది. అయినా మళ్లీ ఆ గడ్డ అతి తక్కువ కాలంలో తిరిగి విపరీతమైన పరిమాణంలో పెరుగుతూ వచ్చింది. మళ్లీ ఎంజీఎం ఆస్పత్రిలో ఇంతకు ముందు సర్జరీ చేసిన డాక్టరును కలిస్తే హైదరాబాదులోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ గాని, ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ కానీ వెళ్ళమని సూచించారు. అక్కడికి వెళ్లగా… అన్ని రకాల టెస్టులు చేసి.. అది క్యాన్సర్ గడ్డ అని, అది ఆరోగ్యశ్రీకి వర్తించదని గడ్డ చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నదని చెప్పారు.

ఆపరేషన్ కి 3,50000 వరకు అయ్యే అవకాశం..!
ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ ఆపరేషన్ చేయడానికి ముగ్గురు డాక్టర్లు ఉండాలి. వారిని బయటనుండి తీసుకురావాలి. బయటనుండి డాక్టర్స్ ని ఆపరేషన్ కోసం పిలిపించాలంటే చాలా ఖర్చుతో కూడిన సమస్య. బసవతారకం హాస్పిటల్ లో ఆపరేషన్ చేయాలంటే కనీసం 3,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని, సమస్య క్రిటికల్ గా ఉంటే ఇంకా ఆపరేషన్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. చేతిలో చిల్లి గవ్వ లేదు..టెస్టుల కోసం ఇప్పటికే హైదరాబాద్ కు ఏడు సార్లు వెళ్లి రావడానికి 35,000 రూపాయలు ఖర్చు అయినవి.

దాతలు ఆదుకోవాలి
సుజాత దయనీయ స్థితిని గమనించిన నర్సంపేట K.S.R మహిళా డిగ్రీ కళాశాల చైర్మన్ నరహరి రాజేందర్ రెడ్డి మంచి మనసుతో రూ.5000 ఆర్థిక సహాయంతో పాటుగా రెండుసార్లు తన సొంత కారు ఇచ్చి, సొంత ఖర్చులతో సుజాతను హైదరాబాద్ కి టెస్ట్ ల కోసం పంపించారు. తన కుటుంబానికి సాయం చేయండని, పిల్లలు అనాధలు కాకుండా కాపాడాలని అందరినీ వేడుకుంటోంది.

దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే కింది అకౌంట్ కి చేయగలరు.

Name: మనుబోతుల. సుజాత
Contact numbers:8639872398,
8790686783,
7680949763.
A/C holder :M.Sujatha
Indian Overseas bank
A/c: 375901000003826
IFSC Code:IOBA0003759
Google pay number:9491204036.