భారత్ లో కొత్తగా 5921 కరోనా కేసులు
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : భారత్ లో కొత్తగా 5,921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,57,477కి చేరింది. ఇందులో 4,23,78,721 మంది కరోనా నుంచి బయటపడగా, 5,14,878 మంది బాధితులు మరణించారు. మరో 63,878 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల్లో 289 మంది కరోనా వల్ల మరణించగా, 11,651 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పడిపోయిందని తెల్పింది. మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని పేర్కొన్నది. ఇక్ దేశ వ్యాప్తంగా 1,78,55,66,940 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.