రేపట్నుంచి టీ సాట్ లో టెట్ ఆన్లైన్ క్లాసులు 

రేపట్నుంచి టీ సాట్ లో టెట్ ఆన్లైన్ క్లాసులు

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్‌ : తెలంగాణ విద్యాశాఖ నిర్వహించే టెట్ ఎగ్జామ్ కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు టీ సాట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 6 నుంచి టీ సాట్ యూట్యూబ్ చానెల్ లో తరగతులు ప్రారంభంకానున్నాయి.రేపట్నుంచి టీ సాట్ లో టెట్ ఆన్లైన్ క్లాసులు ఏప్రిల్ 6న ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల వరకు మ్యాథ్స్ ( పేపర్ 1) రేఖాగణితం బోధించనున్నారు. ఉదయం 8.30 నుంచి ఉదయం 9 వరకు మ్యాథ్స్ ( పేపర్ 2) రేఖాగణితం బోధించనున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్ ( పేపర్ 1 ) బోధనా శాస్త్రం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంగ్లీష్ ( పేపర్ 2 ) బోధనా శాస్త్రం బోధించనున్నారు.

ఈ టైం టేబుల్ కేవలం 6 తేదీకి మాత్రమే వర్తించనుంది. 7వ తేదీ టైం టేబుల్ ను రేపు విడుదల చేయనున్నారు. ఈ ఆన్లైన్ బోధన జూన్ 5 వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ బోధన కోసం T SAT VIDYA (టీ సాట్ విద్యా) చానెల్ ను సంప్రదించగలరని సూచించింది.