వచ్చే ఎన్నికల బరిలో సీబీఐ మాజీ జేడీ
-మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కావాలి
-సమాజాన్ని మార్చగలిగేది మగువే
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
వరంగల్ టైమ్స్ , సిద్దిపేట జిల్లా : రాజకీయంగా మహిళలకు 33 శాతం కాదు… 50 శాతం రిజర్వేషన్ కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చెప్పారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే, విద్య, పరిశోధన, వాణిజ్యంతోపాటు రాజకీయ సహకారం కూడా ఎంతో ముఖ్యమన్నారు. విజయవాడలో వి.వి.లక్ష్మీనారాయణ తన పుట్టిన రోజు వేడుకను అనాధ బాలల మధ్య జరుపుకున్నారు. స్థానిక బావాజీపేటలోని నవజీవన్ బాల భవనం బాలల మధ్య కేక్ కట్ చేసి, వారితో సహపంక్తి భోజనం చేశారు.అనాధ బాలబాలికలకు ఆయన దగ్గరుండి భోజనం వడ్డన చేశారు. నవజీవన్ బాల భవనంలో ఉండి ఉన్నత చదువులు చదువుకుంటున్న బాలబాలికలతో ఇష్ఠాగోష్ఠిలో పాల్గొన్న జేడీ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కూడా సక్రమంగా అమలు కావడం లేదని, కొన్ని చోట్ల భర్త, ఇతరులు అధికారం చెలాయించే దుస్థితి ఉందన్నారు. రాజకీయ వ్యవస్థ బాగుంటేనే, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.