మ్యాక్స్ వెల్ బాటలో మరో స్టార్ క్రికెటర్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ ప్రారంభానికి ముందే మరో స్టార్ ఆటగాడు ఒక ఇంటి వాడయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌతీ కూడా అదే బాటలో నడిచాడు. ఈ సారి కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ బరిలో దిగుతున్న టిమ్ సౌతీ, చాలాకాలంగా ప్రేమిస్తున్న బ్రయాను పెళ్లి చేసుకున్నాడు. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు వెటరన్ పేసర్.చాలాకాలంగా రిలేషన్ లో ఉన్న ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. ఈ కొత్త దంపతులకు 2017లో ఇండీ మే సౌతీ, 2019లో స్లోయానే అవా సౌతీ జన్మించారు. ఇప్పుడు సౌతీ, బ్రయా జంట తమ రిలేషన్ లో మరో అడుగు ముందుకేసి పెళ్లి చేసుకుంది. ఈ ఫోటోలు షేర్ చేస్తూ ‘ ఫరెవర్ ‘ అని సౌతీ పోస్టు పెట్టాడు. వీటిని చూసిన ఫ్యాన్స్, క్రికెటర్లు ఈ దంపతులపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.