బోధన్ ఘటనపై డీజీపీతో మాట్లాడిన హోంమంత్రి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బోధన్ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజుతో రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడారు. పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ హోంమంత్రికి వివరించారు. కమిషనర్ ఇతర అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారని హోంమంత్రికి డీజీపీ వివరించారు.ఈ సందర్భంగా ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులపై హోంమంత్రి ఆరా తీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలకు సమానమైన ప్రాధాన్యం ఇస్తూ సెక్యులర్ నేతగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అన్ని కులాలకు, అన్ని మతాలకు సమానమైన గౌరవం ఉందన్నారు. పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తతో ఉన్నారని, ప్రజలంతా పోలీసులకు సహకరించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.