యుద్ధం వేళ భారీగా కండోమ్ అమ్మకాలు

యుద్ధం వేళ భారీగా కండోమ్ అమ్మకాలు

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : ఉక్రెయిన్ – రష్యా మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు చాలా వరకు తప్పుబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కండోమ్ లను కొంటున్నారు. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా వాస్తవం. తాజా లెక్కల ప్రకారం గత యేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని ఆ దేశపు ప్రముఖ ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్ బెర్రీస్ పేర్కొన్నది. యుద్ధం వేళ భారీగా కండోమ్ అమ్మకాలుప్రముఖ ఫార్మా చైన్ కూడా తమ కండోమ్ అమ్మకాల్లో 26 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పింది. మొత్తంగా మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్న కండోమ్ ల సంఖ్యలోనే 32 శాతం పెరుగుదల కనిపిస్తోందట. సూపర్ మార్కెట్లలోల కూడా ఈ పెరుగుదల 30 శాతంపైగానే ఉంది. వీటి ధరలు 50 శాతం పెరిగినా కూడా కండోమ్ అమ్మకాల్లో మాత్రం ఎటువంటి తగ్గింపు లేదని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం పశ్చిమ దేశాల ఆంక్షలే అని తెలుస్తోంది.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో కండోమ్ ల ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం రష్యన్లలో పెరిగింది. ఈ కారణంగానే కండోమ్ విక్రయాలు పెరిగాయని తెలుస్తోంది. అయితే కండోమ్ లు తయారుచేసే పశ్చిమ దేశాల కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాన్ని ఆపకపోవడం గమనార్హం. కానీ ఆంక్షల వల్ల రష్యా కరెన్సీ విలువ డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ కారణంగా కండోమ్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కొంటున్న కండోమ్ లను భవిష్యత్తులో వాడేందుకు కొంటున్నారని, అప్పుడు కండోమ్లు ధరలు ఆకాశాన్నంటుతాయని ప్రజలు భావిస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ప్రపంచంలో కండోమ్ లు అత్యధికంగా ఉత్పత్తి చేసే భారత్, థాయ్ ల్యాండ్, దక్షిణ కొరియా, చైనాల నుంచి రష్యాకు దిగుమతులు ఆగలేదని, కాబట్టి కండోమ్ ల కొరత అనేది దేశంలో రాదని అధికారులు అంటున్నారు. అదే సమయంలో ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య దేశాలకు చెందిన కంపెనీల కండోమ్ లు వాడకుండా, రష్యా మిత్ర దేశాల నుంచి వచ్చే మంచి కండోమ్ లు వాడాలని సెక్స్ స్పెషలిస్టులు కూడా రష్యన్ ప్రజలకు సలహాలు ఇస్తున్నారు.