పురోగతి దిశగా పోలవరం ప్రాజెక్ట్ పనులు

పురోగతి దిశగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరిన సీఎం జగన్ ప్రాజెక్ట్ పనుల తీరును వి‌హంగవీక్షణం ద్వారా పరిశీలించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా సాకారం చేసి రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.. ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు.పురోగతి దిశగా పోలవరం ప్రాజెక్ట్ పనులుఅనంతరం ప్రాజెక్ట్ సమావేశ మందిరంలో ఇంజనీర్లు, అధికారులు, గుత్తేదారులతో సీఎం సమావేశమయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత 2019 జూన్ లో తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం ఈ యేడాది ఫిబ్రవరిలో రెండో సారి వెళ్లారు. తాజాగా మూడో సారి పోలవరం పర్యటన చేశారు సీఎం జగన్.పురోగతి దిశగా పోలవరం ప్రాజెక్ట్ పనులు