స్మశానంలో GST సినిమా పోస్టర్​ లాంచ్​

స్మశానంలో GST సినిమా పోస్టర్​ లాంచ్​

హైదరాబాద్​: “తోలు బొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘GST'(GOD SAITHAN TECHNOLOGY).ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్​ను దెయ్యం గెటప్​ చేత స్మశానంలో విడుదల చేశారు. ‘ఇంతవరకు ఎవ్వరూ చేయని వినూత్న రీతిలో చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని నిజమైన స్మశానంలో దెయ్యం గెటప్​చేత విడుదల చేశాం. గత ప్రెస్ మీట్ లలో మా చిత్రం కంటెంట్​ను ,టైటిల్ లోగో ని , కాన్సెప్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేసిన తర్వాత చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయవేత్తలు, మత పెద్దలు, హేతువాదులు, మేధావులు, ఇలా ఎంతోమంది మీ సినిమా కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉన్నట్టుంది. సినిమాను ఎప్పుడు చూడాలా … అని ఆతృతగా వుందని ఫోన్ చేసి ప్రశంసించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రశంసలతో పాటు కొందరు… ఇది నాలుగు గోడల మధ్య చూసే మరో జీఎస్టీ “GST” సినిమానా అని కామెంట్ చేశారు. వారికి ఒకే విషయం చెప్పాను. ఇది నాలుగు గోడల మధ్య చూసే “GST” కాదు నలుగురితో కలిసి చూసే సినిమా. చూసిన తర్వాత మరో నలుగురిని తీసుకొచ్చి చూపించబోయే సినిమా అని చెప్పాను’ అని దర్శకుడు జానకి రామ్​ అన్నారు. నేను ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ ని స్మశానం లోనే ఎందుకు ఎంచుకున్నానంటే.. మనిషి పుట్టిన తర్వాత ఆతని జీవితం.. ఫుట్ పాత్ పై పెరిగినా, పూరి గుడిసెలో బతికినా, ఇంద్ర భవనం లో జీవించినా.. చిట్టచివరికి వచ్చేది స్మశానంలోకే కానీ..ఆ స్మశానాన్ని ఒక అపవిత్ర స్థలంగా భావిస్తూ అందులో భూత ప్రేతాత్మలు ఉంటాయని ఇక్కడికి రావడానికి భయపడుతుంటారు. మరి దేవాలయాలను పవిత్ర స్థలాలుగా భావించినప్పుడు, ఏదైనా కార్యక్రమం మొదలెట్టినప్పుడు.. శుభముహూర్తాలు చూసుకొని ప్రారంభించినప్పుడు..స్మశానాలను పవిత్ర స్థలంగా ఎందుకు భావించకూడదు? ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అష్టమిలో, అమావాస్య లో, దుర్ముహూర్థాలలో ఎందుకు ప్రారంభించకూడదు అనేది నా ప్రశ్న? నేను వాస్తవాలు చెప్పబోతున్నాను కాబట్టే.. ఈ రోజు అర్ధరాత్రి ఆదివారం ఈ స్మశానం లో మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశాను. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతో మంది డైరెక్టర్లు దెయ్యం గురించి ఎన్నో హర్రర్ సినిమాలు తీశారు. వారందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. నేను వాస్తవాలు చెప్పబోతున్నాను కాబట్టే.. వాటన్నిటికీ భిన్నంగా ఒక దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం’ అని చెప్పారు దర్శకుడు జానకిరామ్​. ఈ చిత్రం హీరోలు ఆనంద్ కృష్ణ, అశోక్, హీరోయిన్స్ స్వాతి మండల్ ,యాంకర్ ఇందు పూజ సుహాసిని, కామెడీ పాత్రలో జూనియర్ సంపూ, ఇతర తారాగణం వెంకట్ నందు, వాణి, స్వప్న, ‘వేదం’ నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు, ‘జానపదం’ అశోక్ ,రాథోడ్ మాస్టర్, సూర్య,రమణ,సంతోష్.

ఎడిటింగ్: సునీల్ మహారాణా
డి.ఓ.పి: డి.యాదగిరి
సంగీతం: యు.వి.నిరంజన్
నిర్మాత: కొమారి జానయ్యనాయుడు
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: కొమారి జానకిరామ్
పి.ఆర్.ఓ: మధు వి.ఆర్