షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధంగుంటూరు జిల్లా : పట్టణంలోని కారంపూడి ప్రధాన కూడళ్లలోని అంకాలమ్మ గుడి సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో వెలుగూరి ఆంజనేయులు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అప్పటికే మంటలు వ్యాపించడంతో సమాచారం అందుకున్న కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ హుటాహుటిన తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. దీంతో ఎటువంటి హాని లేకుండా పెనుప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతవాసులు ఎస్సై రవికృష్ణ కు ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ శాఖ ఏఈ మస్తాన్ వలీ సమాచారం అందిన వెంటనే తన సిబ్బందిని పంపించి విద్యుత్ వైర్లు తొలగించి ప్రమాదం జరుగకుండా చేశారు.