ఆర్ఎస్ ను ఆత్మీయంగా పలకరించిన సీతక్క

ఆర్ఎస్ ను ఆత్మీయంగా పలకరించిన సీతక్కవరంగల్ టైమ్స్, ములుగు జిల్లా: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర బీఎస్పీ నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిశారు. మంగపేట మండలంలో పలు కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తున్న క్రమంలో ఏటూరునాగారం వద్ద ఎదురుగా వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సీతక్క ఆత్మీయంగా పలకరించారు. ఇరువురు తమ బాగోగులు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.