అయ్యప్పస్వామి అరవణ ప్రసాదం నిలిపివేత
వరంగల్ టైమ్స్, కేరళ : కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదంను తాత్కాలికంగా నిలిపివేసారు ట్రావెల్ కోర్ దేవస్థానం. ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో తయారవుతున్న అరవణ ప్రసాదంలో వాడుతున్న యాలకుల్లో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు ఫుడ్ సేప్టీ అధికారులు గుర్తించారు. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారక అవశేషాలు ఉన్నట్లు తమ రిపోర్టులో ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదం నిలిపివేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే పంపిణీకి సిద్దంగా ఉన్న ఆరు లక్షల డబ్బాలను ధ్వంసం చేసేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అంతేకాకుండా రేపటి నుంచి యాలకులు లేని అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. రానున్న నాలుగైదు రోజుల్లో మకరజ్యోతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్రసాదం కొరత ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ యుద్ధ ప్రాతిపదికన రేపటి నుంచి యాలకులు లేని అరవణం ప్రసాదాన్ని తయారుచేసి పంపిణీ చేసేందుకు ట్రావెల్ కోర్ దేవస్థానం సిద్ధమైంది.