2వ రోజు అన్నపూర్ణ అలంకారాల్లో అమ్మవార్లు

2వ రోజు అన్నపూర్ణ అలంకారాల్లో అమ్మవార్లు2వ రోజు అన్నపూర్ణ అలంకారాల్లో అమ్మవార్లు

వరంగల్ టైమ్స్,వరంగల్ జిల్లా: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు సోమవారం వరంగల్ నగరంలోని అమ్మవార్లు అన్నపూర్ణా దేవీ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు.నగరంలోని భద్రకాళి ఆలయంలో శ్రీ భద్రకాళి అమ్మవారు, శివనగర్ రామాలయంలోని శ్రీ లలితాదేవి అమ్మవారు, మహాలక్ష్మీ యాజ్ఞిక పీఠంలో బ్రహ్మచారిణీ స్వరూపంలో మహాలక్ష్మీ అమ్మవారు అన్నపూర్ణా దేవీ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అన్నపూర్ణాదేవీ అలంకారాల్లో ఉన్న అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు.