కాసేపట్లో మానుకోటకు సీఎం కేసీఆర్

కాసేపట్లో మానుకోటకు సీఎం కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి మహబూబాబాద్ బయల్దేరారు. మొదట మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ను, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులతో మహబూబాబాద్ జిల్లా ప్రగతిపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా గులాబీమయమైంది.