తారకరత్న మరణవార్త దాచారు : లక్ష్మీ పార్వతి

తారకరత్న మరణవార్త దాచారు : లక్ష్మీ పార్వతి

తారకరత్న మరణవార్త దాచారు : లక్ష్మీ పార్వతివరంగల్ టైమ్స్, హైదరాబాద్ : నందమూరి తారకరత్న మరణంపై వైసీపీ నాయకురాలు, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ప్రతిపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని ఉద్దేశించి ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ముందుగా తారకరత్న మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేసిన లక్ష్మీ పార్వతి ఆపై చంద్రబాబుపై మండిపడ్డారు.

ఇదంతా చంద్రబాబు అవలంభిస్తున్న నీచమైన రాజకీయ విధానమని ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు. తన కుమారుడు నారా లోకేష్ పాదయాత్రను ప్రజలు అపశకునంగా భావిస్తారనే ఉద్దేశంతోనే చనిపోయిన తారకరత్నను ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచి అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేశారంటూ లక్ష్మీ పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు.