సీఎం కేసీఆర్ పర్యటన.. ఫుల్ బందోబస్తు 

సీఎం కేసీఆర్ పర్యటన.. ఫుల్ బందోబస్తు

వరంగల్ టైమ్స్, మహబూబాబాద్ జిల్లా : సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో 1600 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీరిలో ముగ్గురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, 17మంది డీఎస్పీలు, 63మంది సీఐలు ,160మంది ఎస్ఐలు, సిబ్బందితో కలిపి 1600 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.