సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి : దాస్యం

సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి: దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతీ ఒక్కరు సైన్స్ పట్ల అవగాహన పెంచుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని శ్రీనివాస్ గురుకుల్ లో రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ను వినయ్ భాస్కర్ నేడు ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలో ఇంత మంచి ల్యాబ్ ను ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని చీఫ్ విప్ అభినందించారు. విద్యార్ధులు సైన్స్ ల్యాబ్ ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని దాస్యం వినయ్ భాస్కర్ కోరారు.సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి : దాస్యంజాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్లను దాస్యం వినయ్ భాస్కర్ తిలకించారు. అంనతరం ఎగ్జిబిట్లను తయారు చేసిన విద్యార్థులను వినయ భాస్కర్ అభినందించారు. సైన్స్ పితామహుడు సివి రామన్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించడం అభినందనీయమని స్థానిక కార్పొరేటర్ రావుల కోమల కిషన్ అన్నారు. విద్యార్థులు సివి రామన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ చిదురాల ఇందిర శ్రీనివాస్, యుగేందర్, వినయ్, మనోహర్, ఇస్మాయిల్, నీలిమ, హఫీజ, రేవతి, మాధవి, విజయ్, రాజేష్, స్వప్న, పద్మశ్రీ , శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.