ఎమ్మెల్యే చల్లాకు మహాశివరాత్రి ఆహ్వానం

ఎమ్మెల్యే చల్లాకు మహాశివరాత్రి ఆహ్వానం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: పరకాల నియోజకవర్గం సంగెం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ గంగా భవానీ సమేత సంఘమేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. మార్చి 1న శ్రీశ్రీశ్రీ గంగా భవానీ సమేత సంఘమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – జాతర మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికను అందించారు. ఎమ్మెల్యే చల్లాకు మహాశివరాత్రి ఆహ్వానంఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ కందకట్ల నరహరి, సర్పంచ్ గుండేటి బాబు, కావటి వెంకటయ్య, ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య, కోడూరు సదయ్య, మునుకుంట్ల కోటేశ్వర్, అప్పే నాగార్జున శర్మ, మెట్టుపల్లి కొమురయ్య, బొమ్మ యుగేందర్, బొమ్మగాని వెంకటేశ్వర్లు, చింతల నర్సయ్య, కుమారస్వామి, ఎలుకుర్తి బుచ్చిరెడ్డి, ఎలుగోయ లింగయ్య, పురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.