హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: భాగ్య నగరంలో విదేశీ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న శన్ముక పవన్ శ్రీనివాస్ అనే నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి నగర జాయింట్ పోలీస్ కమిషనర్ వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నగర వాసుల నుంచి డబ్బులు లాగుతూ విదేశాల్లో కిడ్నీ సర్జరీ చేయిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. శ్రీలంకతో పాటు టర్కీ దేశాల్లో రాష్ట్రాల్లో కిడ్నీ సర్జరీ పేరుతో మోసాలు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ ఏజెంట్‌గా ఉంటూ ఇంటర్నెట్ ఆన్‌లైన్ ద్వారా డోనర్స్ పూర్తి వివరాలు సేకరించి కిడ్నీ అవసరం ఉన్న వారికి ఆఫర్స్ ఇచ్చి డబ్బులు లాగుతుండేవాడని డీసీపీ తెలిపారు.హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎలా దొరికాడు…!?
‘కిడ్నీ అవసరం ఉన్న వారి పూర్తి వివరాలు శ్రీలంక, టర్కీ డాక్టర్స్‌కూ చెరవేస్తుండేవాడు. నిందితుడు శ్రీనివాస్‌కి వారు ఫ్లైట్ టికెట్ సమకూరుస్తుండేవారు. ఇతర దేశాలు వెస్టర్న్, నావలోక, హేమాస్, శ్రీలంక ఆస్పత్రుల్లో సర్జరీ చేయిస్తామని బాడుతుల నుంచి 30 నుండి 40 లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. కానీ ఇతర దేశాల్లో అయ్యే ఆపరేషన్ ఖర్చుల గాను ఐదు లక్షలు చెల్లిస్తున్నారు. 2019లో బాధితులు బిజ్జల భారతి గతంలో నిందితుడు శ్రీనివాస్‌ను ఓ మహిళ తన భర్తకు రెండు కిడ్నీలు అవసరం అని కలిశారు. అందుకు నిందితుడు శ్రీనివాస్ 34లక్షలు డిమాండ్ చేశాడు. భార్యభర్తలిద్దరూ అంగీకరించి మొదటి విడతగా 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. నిందితుడు శ్రీనివాస్ బాధితుల నుంచి పాస్‌పోర్ట్ ఫ్లైట్ టికెట్స్ కోసం 14 లక్షలు రూపాయిలు తీసుకోవడం జరిగింది. కానీ ఫ్లైట్ టికెట్స్ ఇతర దేశంలో రూమ్స్ అలాగే వైద్యం ఖర్చులన్నీ సమకూరుస్తానని ప్రామిస్ చేశాడు.హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తి అరెస్ట్తర్వాత బాధితులు 34 లక్షల రూపాయలు అంగీకారం ప్రకారంగ నిందితుడు శ్రీనివాస్‌పై చర్చించడం జరిగింది. కానీ నిందితుడు శ్రీనివాస్ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోగా ఫ్లైట్ టికెట్స్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయడానికి కానీ ఎలాంటి ఏర్పాటు చేయకుండా డబ్బులతో ఉడాయించాడు. బంజారాహిల్స్ కమలాపురి కాలానికి చెందిన బాధిత కుటుంబం బంజారాహిల్స్ పోలీసులకు జూన్ 2019లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. పూర్తి ఆధారాలతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశాం. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 406,420 కింద కేసు నమోదు చేశాం. ప్రజలు ఎవ్వరూ కూడా ఇలాంటి ఏజెంట్ల చేతిలో మోసపోకండి.. ఏమైనా అనుమానం ఉన్న వెంటనే పోలీసులను సంప్రదించండి’ అని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ మీడియా ముఖంగా వెల్లడించారు.