తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు

తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలు

తగ్గిన కరోనా కేసులు..పెరిగిన మరణాలువరంగల్ టైమ్స్, ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో 13,46,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 67,597 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,23,39,611కి చేరింది. నిన్న ఒక్కరోజే 1,188 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,04,062కి చేరింది.