తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలవరంగల్ టైమ్స్, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు,ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12 న ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష ఉండనుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష తేదీలను ఖరారు చేసింది.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
ఏప్రిల్ 20 -పేపర్ 1 తెలుగు/ సంస్కృతి ; పేపర్ 2 తెలుగు/ సంస్కృతి
ఏప్రిల్ 22 – ఇంగ్లీష్ పేపర్ 1 ; ఇంగ్లీష్ పేపర్ 2
ఏప్రిల్ 25 -మాథ్స్ పేపర్1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 ; మాథ్స్ పేపర్ 2A, బొటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్2
ఏప్రిల్ 27 – మాథ్స్ పేపర్ 1B జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్1 ; మాథ్స్ పేపర్ 2B జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్2
ఏప్రిల్ 29 -ఫిజిక్స్ పేపర్ 1, ఏకానమిక్స్ పేపర్1 ; ఫిజిక్స్ పేపర్ 2, ఏకానమిక్స్ పేపర్ 2
మే 2 – కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 ; కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2