రేపటి ప్రజావాణి రద్దు

రేపటి ప్రజావాణి రద్దుహనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి (గ్రీవేన్స్ డే) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాలలో కొవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరు ఆరోగ్యంగా ఉండాలనే ఉదేశ్యంతో ఈ నెల 31న నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దయచేసి జిల్లా ప్రజలు, ఫిర్యాదుదారులు
ఈ సోమవారం నాడు ఫిర్యాదులను సమర్పించేందుకు హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయానికి రావద్దని ఆయన అట్టి ప్రకటనలో వెల్లడించారు.