మార్చి 23న హనుమకొండలో కేటీఆర్ పర్యటన

మార్చి 23న హనుమకొండలో కేటీఆర్ పర్యటనమార్చి 23న హనుమకొండలో కేటీఆర్ పర్యటనవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మార్చి 23న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభం చేయనున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హనుమకొండ రాంనగర్ లోని నిత్య బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కూడా గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగనుందని తెలిపారు.