ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాతృత్వం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన దాతృత్వాన్ని చాటుకున్నారు. దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చే సమయంలో కంటికి గాయాలయ్యి సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కోసం ఆర్థిక సాయం చేశారు.ఎమ్మెల్సీగా తనకు లభించే నెల వేతనం నుంచి బాధితుల చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రి అధికారులకు అందించారు. తెలంగాణ జాగృతి నాయకులు ఈ సాయాన్ని ఆస్పత్రి వైద్యులకు అందించారు అంతేకాకుండా బాధితులకు తోడుగా ఆసుపత్రికి వచ్చే కుటుంబ సభ్యులకు మూడు రోజులపాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చుతూ కంటికి గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని కల్వకుంట్ల కవిత కోరారు.