ఎమ్మెల్యే నరేందర్ పై చేనేతల మండిపాటు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పద్మశాలీలకు క్షమాపణ చెప్పాలని టీపీసీసీ చేనేత విభాంగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పద్మశాలి సంఘం గ్రేటర్ వరంగల్ ఉపాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు నేత డిమాండ్ చేశారు.
మునుగోడు ఎన్నికల్లో భాగంగా ఓట్లు ఆడుక్కోవడానికి వెళ్లిన ఎమ్మెల్యే చేనేత కార్మికులు, పద్మశాలీలు దైవంగా కొలిచి మానవాళికి మానవ రక్షణకు వస్త్రాన్ని తయారు చేసే మగ్గాన్ని, సాక్షాత్తు పద్మశాలి కుల దైవం శ్రీ మార్కండేయ స్వామి నేసిన మగ్గంపై కాలు వేసి అహంకారంగా వ్యవహరించిన ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అహంకారపూరిత వైఖరిని తప్పుపట్టారు.యావత్ పద్మశాలి సమాజం గుండెలపై కాలు మోపినట్టుగా భావిస్తున్నామని, పద్మశాలి సమాజానికి ఎమ్మెల్యే నరేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని ఎడల వరంగల్ తూర్పులో ఉన్న 40 వేల పద్మశాలీలు తమ ఓటుతో ద్వారా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మునుగోడు లోని పద్మశాలి సమాజం తిరగబడి నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తుందని చిప్ప వెంకటేశ్వర్లు హెచ్చరిచారు.
రేపటి లోగా క్షమాపణ చెప్పక పోతే దిష్టి బొమ్మల దహనం, ధర్నాలు, రాస్తా రోకో కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని హెచ్చరించారు. దీనిని అఖిల భారత మరియు తెలంగాణ పద్మశాలి కమిటీ అధ్యక్షులు తీవ్రంగా పరిగణించాలని చిప్ప వెంకటేశ్వర్లు నేత వేడుకున్నారు.