ఈ నెలలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ 

ఈ నెలలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : ప్రభుత్వంలోని 19 శాఖలకు సంబంధించిన 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెలలోనే టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వనున్నది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కు 90 రోజులు, ప్రిలిమ్స్, మెయిన్స్ కు మధ్య 90 నుంచి 100 రోజులు సమయమివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు క్యాలెండర్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. పలు శాఖలు ఇప్పటికే టీఎస్పీఎస్సీకి ఇండెండ్లను సమర్పించగా, ఒకట్రెండు శాఖల నుంచి ఇంకా అందాల్సి ఉన్నది. ఇవి అందగానే పరిశీలించి నోటిఫికేషన్ జారీ చేస్తారు. గ్రూప్ 1 పోస్టుల ప్రక్రియనంతా 2023 ఆగస్టులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.ఈ నెలలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంటర్వ్యూలు 2 నెలలు..
ప్రిలిమ్స్ ఓఎంఆర్ పద్దతిలో, మెయిన్స్ వ్యాసరూప ప్రశ్నలుగా ఉంటుంది. ప్రిలిమ్స్ లో నిర్దిష్ట కటాఫ్ మార్కుల ప్రకారం ప్రతిభ సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ కు అవకాశమిస్తారు. మెయిన్స్ ఫలితాలకు 3 నెలల నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మెయిన్స్ ఫలితాల తర్వాత ఒక పోస్టుకు కొంత మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు ముందే సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మార్కులు కలిపి తుది ఫలితాలను ప్రకటించారు. ఇంటర్వ్యూల నిర్వహణకు 2 నెలలు పడుతుందని అధికారులు అంచనా వేశారు.

గ్రూప్ 1 పోస్టుల ఎంపిక ప్రక్రియ ఇలా కొనసాగుతుంది.. మొదట దరఖాస్తుల స్వీకరణకు 30 నుంచి 40 రోజులు, ప్రిపరేషన్ కు 90 రోజులు, ఫలితాల వెల్లడికి 30 రోజులు, మెయిన్స్ ప్రిపరేషన్ కు 90 నుంచి 100 రోజులు పడుతుంది.