ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్ 

ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : జూనియర్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ లో ఇప్పటికే క్వార్టర్స్ కు దూసుకెళ్లిన భారత టీం లీగ్ దశలో మూడో మ్యాచ్ లోనూ నెగ్గి హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గ్రూప్-‘ డి’ లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో వేల్స్, జర్మనీని చిత్తు చేసిన మన అమ్మాయిలు మంగళవారం జరిగిన ఆఖరి పోరులో 4-0 తో మలేషియాను మట్టికరిపించారు. ముంతాజ్ ఖాన్ ( 10, 26, 59వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ తో విజృంభించగా, సంగీత కుమారి ( 11ని) ఒక గోల్ చేసింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ లో భారత్ హ్యాట్రిక్