ఇంగ్లండ్ పై గెలిచిన భారత హాకీ జట్టు 

ఇంగ్లండ్ పై గెలిచిన భారత హాకీ జట్టు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భువనేశ్వర్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్ లో రెండు జట్లూ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. అయితే చివరకు షూటవుట్ లో భారత జట్టు విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇంగ్లండ్ పై గెలిచిన భారత హాకీ జట్టు మ్యాచ్ ముగియడానికి కేవలం 12 సెకన్లు మాత్రమే ఉండగా, ఇంగ్లండ్ ఆటగాడు గోల్ చేయడంతో మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. దీంతో షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించాలని నిర్ణయించారు. షూటవుట్ లో కూడా రెండు జట్లు గట్టి పోటీనిచ్చాయి. 5 అవకాశాల్లో రెండు పాయింట్లు సాధించిన భారత జట్టు , ఏడో అటెంప్ట్ లో 3-2 తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది.