కాల్పులతో దద్దరిల్లిన అమెరికా 9 మంది మృతి

కాల్పులతో దద్దరిల్లిన అమెరికా 9 మంది మృతి

వరంగల్ టైమ్స్, న్యూయార్క్ : అమెరికాలో కాలిఫోర్నియాలోని డౌన్ టౌన్ సాక్రమెంటో నగరంలో ఆదివారం ఉదయం దుండగుల కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. 9 మందికి గాయాలయ్యాయి. డల్లాస్ లో ఓ మ్యూజిక్ ఈవెంట్ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, 10 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మెక్సికోలోని అకాపుల్కో రిసార్టు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఓ రెస్టారెంట్ వద్ద కాల్పులు జరిగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పారిపోతున్న ఓ దుండగుడిని వెంటాడి మట్టుబెట్టారు.కాల్పులతో దద్దరిల్లిన అమెరికా 9 మంది మృతి