అమెరికాలో డీప్ ఫ్రీజ్ పరిస్థితులు 

అమెరికాలో డీప్ ఫ్రీజ్ పరిస్థితులు

అమెరికాలో డీప్ ఫ్రీజ్ పరిస్థితులు 

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. అక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. న్యూహ్యాంప్ షైర్ మౌంట్ వాషింగ్టన్ లో చలిగాలులు విపరీతంగా పెరిగాయి. న్యూయార్క్ లో విండ్ చిల్ వార్నింగ్ జారీ చేశారు. ఇక్కడ అతి శీతల గాలులు వీస్తున్నాయి. మసాచుసెట్స్, కనక్టికట్, రోడ్ ఐలాండ్, న్యూహ్యాంప్ షైర్, వెర్మోంట్, మెయిన్ రాష్ట్రాల్లో ఉన్న సుమారు 1.6 కోట్ల మంది చలికి వణికిపోతున్నారు.

మౌంట్ వాషింగ్టన్ ప్రాంతంలో మైనస్ 46 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెల్పింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు మరికొన్ని రోజులుంటాయని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో వాతావరణం ప్రాణాంతకంగానే ఉన్నట్లు వెదర్ సర్వీస్ వెల్లడించింది.

బోస్టన్, వార్ సెస్టర్, మసాచుసెట్స్, న్యూ ఇంగ్లాండ్ లాంటి పట్టణాల్లో స్కూళ్లను మూసివేశారు. హైపోథర్మియా, ఫ్రోస్ట్ బైట్ నుంచి తప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. బోస్టన్ మేయర్ ఎమర్జెన్సీ వార్నింగ్ సంకేతాలిచ్చారు.