పేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ అండ : దాస్యం

పేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ అండ : దాస్యం

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : నిరుపేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. పశ్చిమ నియోజకగర్గంలోని దర్గా కాజీపేటకు చెందిన పి.సక్కుబాయీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్సకై ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న సక్కుబాయి పరిస్థితిని స్థానిక నాయకులు చీఫ్ విప్ దృష్టికి తీసుకెళ్ళారు.పేదల ఆరోగ్యానికి టీఆర్ఎస్ అండ : దాస్యంఅనారోగ్యంతో పాటు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలు సక్కుబాయి పరిస్థితిని స్థానికుల ద్వారా తెలుసుకున్న చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆర్ధిక చేయూతనందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సీఎం సహాయనిధి ( ఎల్ ఓసీ) ద్వారా రూ. 2 లక్షల చెక్కును మంజూరు చేయించి నేడు సక్కుబాయికి నేరుగా అందించారు. ఆమెను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మాజీ కార్పొరేటర్ అబూబకర్ , స్థానిక టీఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.