ప్రేమ పేరుతో వ్యభిచారంలోకి ఆపై ఏంజరిగింది.!

ప్రేమ పేరుతో వ్యభిచారంలోకి ఆపై ఏంజరిగింది.!

వరంగల్ టైమ్స్, గుంటూరు జిల్లా : ప్రేమ పేరుతో వల వేసి అమ్మాయిని వ్యభిచార కూపంలోకి దింపబోయిన వ్యక్తులను గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం సాయంత్రం మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ జే.రాంబాబు వెల్లడించారు. మంగళగిరి పట్టణానికి చెందిన ఓ మైనర్ బాలికను రాజేష్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమిస్తున్నానని చెప్పి వెంటపడ్డాడు.ప్రేమ పేరుతో వ్యభిచారంలోకి ఆపై ఏంజరిగింది.!ఈ క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి గత నెల 22న ఉదయం బాలిక బంధువులైన వినోద్, అవినాష్ ల సహాయంతో మంగళగిరి నుండి కారులో యాదగిరి గుట్టకు సమీపంలో ఓ లాడ్జికి తరలించారు. అనంతరం వ్యభిచారం నిర్వహించే సిరి అనే మహిళ వద్దకు తీసుకువెళ్ళి బంధించారు. బాధితురాలు చాకచక్యంగా వారి నుండి తప్పించుకుని డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందజేసింది.

అప్పటికే మంగళగిరి పోలీసులు బాలిక మిస్సింగ్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో బాలిక ఫోన్ తో అప్రమత్తమైనట్లు తెలిపారు. వెంటనే హుటాహుటిన బాలికను కాపాడి, నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో కంసాని రాజేష్ (32), శాంబ్రావు అవినాష్ (28), కంసాని వినోద్ (31), కంసాని సిరి (20) లను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అర్బన్ ఎస్పీ ఆదేశాలతో రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సీఐ భూషణం, ఎస్ఐ లు ఈ.నారాయణ, మహేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.