వాహనదారులకు గుడ్ న్యూస్

వాహనదారులకు గుడ్ న్యూస్వరంగల్ టైమ్స్, హైదరాబాద్: వాహనదారులకు పోలీస్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణవ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి 1 నుంచి 31వరకు నెల రోజుల పాటు చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ తో పాటు లోక్ అదాలత్ ద్వారా చెల్లించే వీలు కల్పించారు. ద్విచక్ర, త్రిచక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75 శాతం మాఫీ చేయగా, 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

ఆర్టీసీ బస్ లకు 70శాతం, లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. గత రెండేళ్లుగా కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.