సీఎం జగన్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి భేటీ

సీఎం జగన్ తో ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి భేటీవరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అనంతరం సీఎంతో కసిరెడ్డి భేటీ అయ్యారు. డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించడంతో మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మంగళవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేసింది.

ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తర్వాత ఉత్తర్వులు ఇచ్చేంత వరకు జీఏడీలో రిపోర్ట్ చేయాలని సవాంగ్ ను ప్రభుత్వం ఆదేశించింది.