రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల బదిలీలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 30 మంది ఐపీఎస్ లను బదిలీ చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్ ఏసీబీ డీజీగా అంజనీ కుమార్, హైదరాబాద్ సిటీ సీపీగా సీవీ ఆనంద్ ను నియమించారు.

హైదరాబాద్ డిప్యూటీ సీపీగా గజరావ్ భూపాల్ డీడీ,
హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్,
జాయింట్ సీపీ ( క్రైం)గా ఏఆర్ శ్రీనివాస్,
వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్,
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్,
సైబరాబాద్ డీసీపీ (క్రైం) గా కామేశ్వర్,
సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి,

హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందన దీప్తి,
హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్,
హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్,
హైదరాబాద్ జాయింట్ సీపీగా కార్తికేయ,
హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఎన్.ప్రకాశ్ రెడ్డి,

శంషాబాద్ డీసీపీగా ఆర్.జగదీశ్వర్ రెడ్డి,
ఆసీఫాబాద్ ఎస్పీగా సురేష్,
వికారాబాద్ ఎస్పీగా కోటి రెడ్డి,
మాదాపూర్ డీసీపీగా శిల్పవల్లి,
నారాయణపేట్ ఎస్పీగా ఎన్.వెంకటేశ్వర్లు,
సిద్దిపేట సీపీగా శ్వేతా,

నల్గొండ ఎస్పీగా రమా రాజేశ్వరి,
మెదక్ ఎస్పీగా రోహిణీ ప్రియదర్శిని,
నిజామాబాద్ సీపీగా కేఆర్ నాగరాజు,
ఆదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి,
నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్,
బాలానగర్ డీసీపీగా గోనె సందీప్,

జనగామ డీసీపీగా పి.సీతారాం,
భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి,
మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్,
కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.