రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

ఆదిలాబాద్ : జిల్లా పరిధిలోని ఉట్నూరు మండలం కమ్మరి తండా వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన రెండు బైక్ లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. వీరిని నార్నూర్ మండలం తడి హత్నూర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ పెరికగూడకు చెందిన మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.adi