వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదంవిశాఖ జిల్లా : విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్ -2లో ల్యాడిల్ కు రంధ్రం పడింది. దీంతో ద్రవ ఉక్కు నేలపాలైంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి అక్కడే ఉన్న రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. ఈ ప్రమాదంలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.