దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని క్రిస్మస్ విషెష్

దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని క్రిస్మస్ విషెష్
న్యూఢిల్లీ : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మానవత్వాన్ని చాటే ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రార్థించారు.