దీప్తి సునయన బ్రేకప్ పై షణ్ముఖ్ ఏమన్నాడు?

దీప్తి సునయన బ్రేకప్ పై షణ్ముఖ్ ఏమన్నాడు?

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ రన్నర్ షణ్ముఖ్ జస్వంత్ కు అతని ప్రేయసి దీప్తి సునయన బ్రేకప్ చెప్పింది. న్యూ ఇయర్ మొదటి రోజే అందరికీ షాకిచ్చింది. 5 యేళ్ల తమ ప్రేమ బంధాన్ని తెగతెంపులు చేసుకుంది. ఈ విషయాన్ని దీప్తి సునయన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది. ఈ క్రమంలోనే బ్రేకప్ పై స్పందించాడు షణ్ముఖ్.దీప్తి సునయన బ్రేకప్ పై షణ్ముఖ్ ఏమన్నాడు?తన బాధను చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. ఈ నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకి ఉందన్నాడు షణ్ముఖ్. ఇప్పటి వరకు ఆమె చాలా ఎదుర్కొందని, ఇప్పటికైనా సునయన సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరినట్లు తెలిపారు. చివరగా తాను కోరుకునేది అదొక్కటే అని షణ్ముఖ్ తెలిపాడు.

మా దారులు వేరైనప్పటికీ ఒకరికి ఒకరు అండగా ఉంటాం. గొప్ప వ్యక్తిగా ఎదిగేందుకు ఈ 5యేళ్లు తాను అందించిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు షణ్ముఖ్. నువ్వు సంతోషంగా ఉండాలి. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ దీపూ అని షణ్ముఖ్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.