ఆ రాష్ట్రంలో 30 మంది ప్రజాప్రతినిధులకు కరోనా

ఆ రాష్ట్రంలో 30 మంది ప్రజాప్రతినిధులకు కరోనానాసిక్ : మహారాష్ట్రలో మళ్లీ కొవిడ్ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన 10 మంది మంత్రులు, 20 ఎమ్మెల్యేలకు కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిర్వహించిన టెస్టింగ్ లో ఎమ్మెల్యేలకు వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. ఇలాగే కేసులు పెరుగుతుంటే, ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కేవలం మహారాష్ట్రలో 454 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాస్తవానికి శీతాకాల అసెంబ్లీ సమావేశాలను సాధారణంగా నాగపూర్ లో నిర్వహిస్తారు. కానీ కొవిడ్ మహమ్మారి వల్ల ఈ సారి ఆ సమావేశాలను ముంబైలో నిర్వహించారు. అసెంబ్లీ సమావేశా వేళ మొత్తం 50 మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.