వైఎస్ఆర్ కడప జిల్లా : మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు వచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2వ రోజు శుక్రవారం ఉదయం 9.35గంటలకు డాక్టర్ వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. సీఎంతో పాటు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజద్ భాష, జిల్లా ఇంఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, మత్స్య శాఖ మంత్రి అప్పలరాజు, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఇడుపులపాయలోని డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి సీఎం జగన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు సీఎం తల్లి వైఎస్ విజయమ్మ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. కోవిడ్ నేపథ్యంలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.